ఇది ప్రాంతీయ సమస్యో, జాతీయ సమస్యో కాదు. ప్రపంచ సమస్య, మనిషి లైంగిక సమస్య. ఎవరి సెక్సువల్ ఓరియెంటేషన్ వారిది. ఎవరూ దాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. LGBT కమ్యూనిటీకి చెందినవారు సహజమైన వారేనని సమాజం అర్థం చేసుకుంటేనే వారి సమస్యలు తీరుతాయి. ఆ దిశగా ఈ నవల ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను.