మనకి ఎంతోమంది దేవీ దేవతలు ఉన్నారు. మన సమస్యలు తీరాలన్నా,మన కోరికలు నెరవేరాలన్నా, దైవానుగ్రహం తప్పనిసరిగా ఉండి తీరాల్సిందే. ఈ దైవానుగ్రహం పొందటానికి మనం పూజలు, జపాలు, హోమాలు, అభిషేకాలు, ఇలా పలు రకాలుగా దేవతలని ఆరాధిస్తూ ఉంటాం. ఏ దేవత అయినా, ఏ దేవుడైనా మనల్ని అనుగ్రహించాలంటే వారి మంత్రాలని శ్రద్ధ భక్తులతో ఉపాసించాలి. అలా చేసినప్పుడే వారి అనుగ్రహం మనపై కురిసి, మన కష్టాలు బాధలు తీరుతాయి. మంత్రసాధన చేసే వారి కోసం ప్రత్యేకంగా వివిధ దేవీ దేవతల ఉపాసనా విధానాలతో గ్రంథాలను రూపొందించి మీకు అందిస్తున్నాం. దేవతలకు సంబంధించిన పూజ ,జపహోమ విధానాలతో పాటు ,దేవతల అనుగ్రహాలని కలిగించే స్తోత్రాలను కూడా ఈ గ్రంథాలలో పొందుపరిచాము. మంత్రసాధకులు అందరూ, వివిధ ప్రామాణిక మంత్ర శాస్త్ర గ్రంథాల ఆధారంగా సంకలనం చేసిన ఈ ఉపాసనా గ్రంథాలని ఉపయోగించుకొని, ఐహిక ఆముష్మిక ఫలాలు పొందవలసిందిగా కోరుతున్నాము.