విమర్శకుడిగా ఇది నా రెండవ పుస్తకం. ఈ పుస్తకంలో 17 కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన పుస్తకాలపై రాసిన వ్యాసాలను పొందుపరిచాను. వీరందరూ తెలుగు సాహిత్యంలో పేరొందిన సాహిత్యవేత్తలు. వారి సాహిత్య అనుభవమంత వయసు కూడా నాకు లేదు. సాహిత్యం, భాష మీద ఎనలేని ప్రేమ, బాధ్యత చేత ఇంతటి సాహసం చేశాను. ప్రస్తుతం 17 పుస్తకాలపై వ్యాసాలు రాశాను. భవిష్యత్తులో తక్కినవారి పుస్తకాలపై రాయడానికి ప్రయత్నిస్తాను. నేను చేసిన ఈ ప్రయత్నానికి మీ అందరి ఆదరణ కోరుతున్నాను.
జాని తక్కెడశిల కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత