సద్గురు యాప్ ద్వారా, తాజా వ్యాసాలు చదవండి, పాడ్కాస్ట్ లను వినండి, ఇంకా ఆధ్యాత్మికత నుంచి మొదలుపెట్టి, విజయసాధన, సంబంధ బాంధవ్యాలు, ఆరోగ్యం, ఒత్తిడి లేని జీవితం, ఇలా అనేక అంశాలపై తాజా వీడియోలను చూడండి. సద్గురు సుభాషితాలు, వీడియోల ద్వారా మీ జీవితంలో ఒక చుక్క ఆధ్యాత్మికతను ఆస్వాదించండి. మీకు యోగా కొత్త అయినట్లయితే, మీ కోసం ఉప-యోగ ఇంకా గైడెడ్ ధ్యానాలు ఉన్నాయి. రోజూ కేవలం కొద్ది నిమిషాలు వెచ్చించడం ద్వారా, ఈ ఉచిత సాధనలు, ఒత్తిడిని ఇంకా ఆందోళనని జయించడంలో, ప్రశాంతతని ఇంకా ఆనందాన్ని పొందడంలో సయపడతాయి.
సద్గురు గురించి, ఈశా కార్యక్రమాల గురించి సమాచారం పొందుతూ ఉండండి. ఈశా కేంద్రం యొక్క లైవ్ మ్యాప్ ను ఏర్పాటు చేశాము, ఇప్పుడు మీరు ఒక్క క్లిక్కుతో డ్రైవింగ్ డైరెక్షన్ లను పొందవచ్చు.
సద్గురు
● సద్గురు సుభాషితాలు – జ్ఞానం, స్ఫూర్తినిచ్చే సద్గురు సుభాషితాలు.
● రోజువారి వీడియోలు - మీ ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రారంభించేందుకు చిన్న జ్ఞాన గుళికలు.
● సద్గురు వీడియోలు, వ్యాసాలు, పాడ్కాస్ట్ లు - ఆసక్తికరమైన అనేక అంశాలపై తాజా వీడియోలు ఇంకా వ్యాసాలు.
ఉచిత యోగ సాధనలు
ఈ 5 నిమిషాల సాధనలు మీ ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, ప్రేమని, ఇంకా విజయాన్ని పెంపొందించి, ఈ ఆధునిక జీవన శైలిని తట్టుకోగలగడానికి, మీ పూర్తి సామర్ధ్యాన్ని వెలికితీయడానికి సాయపడతాయి.
● ఆరోగ్యం కోసం యోగ - ఇది మీ కీళ్ళలోని శక్తి కేంద్రాలను క్రియాశీలం చేసే ఒక తేలికైన పద్ధతి. మీ కండరాలకు వ్యాయామాన్నిచ్చి, మీ శరీర వ్యవస్థ అంతటికీ హాయి కలిగిస్తుంది.
● రోగ నిరోధక శక్తి కోసం యోగ - ఈ కోవిడ్ సమయాలలో మీ రోగ నిరోధక శక్తిని ఇంకా ఊపిరితిత్తుల సామర్ధ్యాన్ని పెంపొందించడంలో సాయపడే సాధనాలు ఇవి.
● విజయం కోసం యోగ - ఈ సులభమైన సాధన, వెన్నెముకని ఆరోగ్యంగా ఇంకా క్రియాశీలంగా ఉంచడంలో సాయపడుతుంది, తద్వారా సహజంగానే విజయాన్ని చేకూరుస్తుంది.
● పూర్ణ శ్రేయస్సు కోసం యోగ – యోగ నమస్కారం ఒక తేలికైన, శక్తివంతమైన ప్రక్రియ. ఇది కటి ప్రాంతాన్ని సక్రియం చేస్తుంది, ఇంకా వృద్ధాప్యం కారణంగా వెన్నెముక కూలిపోకుండా ఉండటానికి కండరాలను బలోపేతం చేస్తుంది.
● శాంతి కోసం యోగ - నాడి శుద్ది సాధన, నాడులను అంటే, ప్రాణ శక్తి ప్రవహించే మార్గాలను శుద్ది చేస్తుంది. ఫలితంగా వ్యవస్థలో మానసిక కుశలత ఏర్పడుతుంది.
● ఆనందం కోసం యోగ - నాద యోగ అంటే, ధ్వనులు చేయడం ద్వారా అంతరంగంలో ఒక ఆనంద వాతావరణాన్ని సృష్టించే ప్రక్రియ. మీరు సహాజంగానే హాయిగా ఉండేలా చేస్తుంది.
● అంతరంగ అన్వేషణ కోసం యోగ - శాంభవి ముద్ర ఒక తేలికైన, పెద్దగా ప్రయత్నం అవసరం లేని ప్రక్రియ. ఇది మీ గ్రాహ్యతను పెంచి, అనుగ్రహానికి పాత్రులయ్యేలా చేస్తుంది.
● ప్రేమ కోసం యోగ – నమస్కారంతో అరచేతుల్లో ఉన్న ఎన్నో నాడులను కలపడం ద్వార, మీ శరీర రసాయన వ్యవస్థని, మీలో ప్రేమ పొంగే విధంగా మార్చుకోవచ్చు.
గైడెడ్ ధ్యానాలు
● ఈశా క్రియ – సద్గురుచే రూపొందించబడిన ఉచిత గైడెడ్ ధ్యానాన్ని నేర్చుకోండి
● సద్గురు ప్రజెన్స్ టైం – ప్రతిరోజూ సాయంత్రం 6:20 కి, 7 నిమిషాల గైడెడ్ చాంట్ ద్వారా, సద్గురు సాన్నిధ్యాన్ని అనుభూతి చెందండి.
:● చిత్ శక్తి ధ్యానాలు –మనకి కావాల్సిన దాన్ని సృష్టించుకునేందుకు మనసు శక్తిని వినియోగించడాన్నే చిత్ శక్తి అంటాము. ఈ నాలుగు చిత్ శక్తి గైడెడ్ ధ్యానాలు మీ జీవితంలో ప్రేమ, ఆరోగ్యాన్ని, ప్రశాంతతని ఇంకా విజయాన్ని సమకూర్చుకునేందుకు సాయపడతాయి:
· ప్రేమ కోసం చిత్ శక్తి ధ్యానం
· ఆరోగ్యం కోసం చిత్ శక్తి ధ్యానం
· శాంతి కోసం చిత్ శక్తి ధ్యానం
· విజయం కోసం చిత్ శక్తి ధ్యానం
ఈశా యోగ ప్రోగ్రాములు
● ఇన్నర్ ఇంజినీరింగ్ ఆన్లైన్ (ఏడు 90 నిమిషాల సెషన్లు ఉంటాయి. ఇవి ప్రాచీన యోగ శాస్త్రం నుంచి - మీరు జీవించే విధానాన్ని, మీ వ్యవహారశైలిని, ఇంకా మీ జీవితానుభూతిని పరివర్తన చేయగల సామర్థ్యం గల - శక్తివంతమైన ఉపకరణాలను అందిస్తాయి)
● ఈశా సెంటర్లకు వెళ్ళే ఏర్పాటు చేసుకోండి
● మీ దగ్గరలో, రాబోయే ఈశా యోగ ప్రోగ్రాములను వెతకండి
● ఈశా యోగ సెంటర్ల గురించి, ప్రతిష్టిత ప్రదేశాల గురించి మరింత తెలుసుకోండి
● ఈశా ఔట్ రీచ్ ప్రాజెక్టుల గురించి మరింత తెలుసుకోండి
సద్గురు ఎక్స్‌క్లూజివ్- మార్మికతని ఇంకా ఆధ్యాత్మికతని వీడియోల ద్వారా అన్వేషించేందుకు ఒక వేదిక.
మ్యూజిక్ ఇంకా వాల్‌పేపర్లు
● సౌండ్స్ ఆఫ్ ఈశా సంగీతం
● ఉచితంగా డౌన్లోడ్ చేసుకునేందుకు, ఆదియోగి వాల్‌పేపర్లు ఇంకా మరెన్నో
వెబ్సైట్ : isha.sadhguru.org
ఫేస్బుక్ : facebook.com/sadhguru
ఇన్స్టాగ్రామ్ : instagram.com/sadhguru
ఫీడ్ బ్యాక్ :
[email protected]