ఎక్కువ ప్రభావాన్ని చూపే సరదాగా, సులభంగా ఉండే ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి! ఒక్కో స్థాయిని దాటుకుంటూ వెళ్ళండి, బ్యాడ్జ్‌లను అన్‌లాక్ చేయండి, అడుగడుగునా మీరు సాధించిన విజయాలను షేర్ చేయండి! మీ స్వచ్ఛంద కంట్రిబ్యూషన్‌ల సాయంతో మీ ప్రాంతంలో Google ప్రోడక్ట్‌లు మరింత ఉపయోగకరంగా మారతాయి. Google Assistant మరింత బాగా అర్థం చేసుకునే విధంగా దానికి నేర్పండి, మీ భాష విషయంలో Google Translateను మెరుగుపరచండి, ఆబ్జెక్ట్‌లను గుర్తించడంలో Google Photosకు సహాయపడండి. Googleను స్థానికంగా, అలాగే ప్రపంచ వ్యాప్తంగా మెరుగుపరచగల, నిత్యం వృద్ధి చెందే వివిధ రకాల కంట్రిబ్యూషన్‌లలో ఇవి కొన్ని మాత్రమే.
Google కంట్రిబ్యూటర్‌ల కమ్యూనిటీలో చేరడానికి ఈ టాస్క్‌లలో కొన్నింటిని ట్రై చేయండి:
కల్చరల్ ఇమేజ్ వెరిఫికేషన్: సులభమైన అవును/కాదు సమాధానాలు చెప్పి, ఇమేజ్‌లు కల్చరల్‌గా సరిగ్గానే ఉన్నాయో లేదో వెరిఫై చేయండి.
ప్రశ్నను అర్థం చేసుకోవడం: ఇచ్చిన ప్రశ్నను మీరు ఎంత బాగా అర్థం చేసుకోగలరో ఎంచుకోండి.
ఇమేజ్‌లను పోల్చడం: మీకు ఏ ఇమేజ్ బాగా నచ్చిందో చెప్పండి.
చేతిరాత వ్యాలిడేషన్: మీరు చూసే టెక్స్ట్‌కు చేతిరాత మ్యాచ్ అవుతుందో లేదో చెప్పండి.
చేతిరాతను చదవడం: చేతిరాత ఏమి చెబుతుందో మీరు గుర్తించగలరేమో చెప్పండి.
చేతిరాతలను పోల్చడం: మీకు నచ్చిన దాన్ని ఎంచుకోవడానికి, రెండు స్టయిళ్ల చేతిరాతను పోల్చి చూడండి.
పాయింట్ వెరిఫికేషన్: సెంటర్ పాయింట్, సబ్జెక్ట్ పైన ఉందని వెరిఫై చేయండి.
ఆహారాన్ని పోల్చడం: రెండు ఆహార ఇమేజ్‌ల లక్షణాలను పోల్చి చూడండి.
ఆడియో డొనేషన్: స్పీచ్ టెక్నాలజీని మెరుగుపరచడానికి, మీ వాయిస్‌ను రికార్డ్ చేయండి.
ఆహార విశేషాలు: ఏదైనా వంటకానికి ప్రత్యేక లక్షణాలు ఉన్నాయో లేదో చెప్పండి.
ఫుడ్ లేబులర్: ఇమేజ్‌లో ఎటువంటి ఆహార పదార్థాలు ఉన్నాయో చెప్పండి.
అర్థాలను పోల్చడం: రెండు పదబంధాల అర్థం ఒకటేనా, కాదా అనేది నిర్ణయించండి.
చార్ట్‌ను అర్థం చేసుకోవడం: చార్ట్‌లను అర్థం చేసుకోవచ్చో, లేదో, అలాగే అవి నమ్మదగినవో, కాదో నిర్ణయించండి.
పదం పూర్తయ్యేదాకా వేలిని తీసివేయకుండా టైప్ చేయడం: మీకు కనిపించే టెక్స్ట్‌ను టైప్ చేయడానికి కీబోర్డ్ మీద వేళ్లను తీసివేయకుండా టైప్ చేయండి.
ఆడియో వ్యాలిడేషన్: చిన్న ఆడియో క్లిప్‌ను విని, ఆ ఉచ్ఛారణ మీ భాషలో సహజంగా అనిపిస్తుందో లేదో నిర్ణయించండి.
ఇమేజ్ వివరణ: స్పీచ్ టెక్నాలజీని మెరుగుపరచడానికి మీకు అందించిన ఇమేజ్‌లను వివరిస్తూ మీ వాయిస్‌ను రికార్డ్ చేయండి.
ఇమేజ్ లేబుల్ వెరిఫికేషన్: ఇమేజ్‌లు సరిగ్గా ట్యాగ్ అయ్యాయో లేదో చెప్పండి.
ఇమేజ్ క్యాప్చర్: మీ చుట్టూ ఉన్న ప్రపంచానికి సంబంధించిన ఫోటోలను కలెక్ట్ చేసి, షేర్ చేయండి.
అనువాదం: పదబంధాలను, పదాలను వేర్వేరు భాషలలోకి అనువదించండి.
అనువాద వ్యాలిడేషన్: ఏయే పదబంధాలు సరిగ్గా అనువదించబడ్డాయో ఎంచుకోండి.
చేతిరాత గుర్తింపు: చేతిరాతను చూస్తూ, అందులో మీకు కనిపించే టెక్స్ట్‌ను టైప్ చేయండి.
సెంటిమెంట్ ఎవాల్యుయేషన్: ఒక వాక్యం మీ భాషలో పాజిటివ్‌గా ఉందా, నెగిటివ్‌గా ఉందా, మధ్యస్థంగా ఉందా అనేది నిర్ణయించండి.
స్మార్ట్ కెమెరా (Android Lollipop 5.0+ అవసరం): కెమెరాను ఒక ఆబ్జెక్ట్ వైపు ఫోకస్ చేసి, ఆ ఆబ్జెక్ట్‌ను కెమెరా గుర్తించగలుగుతుందో లేదో చూడండి.
మీరు సమాధానాన్ని సమర్పించిన ప్రతిసారి, రాబోయే కాలంలో Google ప్రోడక్ట్‌లు మరింత మందికి అందుబాటులో ఉండేలా చేయడంలో మీరు సాయపడిన వారవుతారు. మీరు అందించే సహాయానికి పెర్క్‌ల రూపంలో మీకు రివార్డ్‌లు కూడా అందుతాయి, ఉదాహరణకు, స్థానిక మీటింగ్‌లలో ఇతర కంట్రిబ్యూటర్‌లను కలవడం, Google ఉద్యోగులతో, ఇతర కంట్రిబ్యూటర్‌లతో ఆన్‌లైన్ Hangoutsకు ప్రత్యేక ఆహ్వానాలను అందుకోవడం, Crowdsource సోషల్ మీడియా ఛానెళ్లలో ఫీచర్ అవ్వడం వంటివి పొందగలరు. మీరు రైలు ప్రయాణంలో ఉన్నా, బస్ స్టాప్‌లో లేదా క్యూలైన్‌లో వేచి ఉన్నా, కొంత సమయం కేటాయించి మీ స్థానిక కమ్యూనిటీ కోసం Googleను మెరుగుపరచండి.
అప్‌డేట్ అయినది
19 మే, 2025